हिन्दी | Epaper

Uttar Pradesh Crime: ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన వ్యక్తి

Tejaswini Y
Uttar Pradesh Crime: ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన వ్యక్తి

UP News: ఆస్తి పంపకాల విషయంలో చెలరేగిన విరోధాలు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh Crime)లో చోటుచేసుకుంది. తన పేరుపై ఆస్తి బదిలీ చేయలేదన్న కోపంతో ఓ వ్యక్తి తండ్రితో పాటు సోదరి, మైనర్ మేనకోడలిని కిరాతకంగా హత్య (Minor Girl Murder) చేసిన కేసులో నిందితుడైన ముఖేశ్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Read also: JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్

Uttar Pradesh Crime
Uttar Pradesh Crime: Man kills family over property

పోలీసుల వివరాల ప్రకారం..

పోలీసుల వివరాల ప్రకారం.. లోకాపూర్ గ్రామానికి చెందిన రామసింగ్ (60) తన ఆస్తిని చిన్న కుమారుడు ముకుంద్ లాల్ పేరుపై రాయడం పెద్ద కుమారుడు ముఖేశ్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. కొంతకాలంగా తండ్రితో ఆస్తి విషయంలో అతడు తీవ్ర వాగ్వాదాలకు దిగుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం రాత్రి ముఖేశ్ తండ్రి నివాసానికి చేరుకుని ఘర్షణకు దిగాడు. వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీయడంతో ముఖేశ్ ముందుగా తన తండ్రి రామసింగ్‌ను గొంతు నులిమి హత్య చేశాడు.

అనంతరం అడ్డువొచ్చిన సోదరి సాధన (24), ఆమె కుమార్తె ఆస్థ (14)లను గొడ్డలితో నరికి అమానుషంగా హతమార్చాడు. అనంతరం ఆధారాలు దాచే ఉద్దేశంతో మూడు మృతదేహాలను ఇంటి సమీపంలో ఉన్న పాడుబడిన బావిలో పడేసి, పైభాగాన్ని ఎండుగడ్డితో కప్పివేశాడు.

ట్రిపుల్ మర్డర్‌కు పాల్పడ్డ నిందితుడు అరెస్ట్

హత్యల అనంతరం కూడా ముఖేశ్ ఆగకుండా, మరుసటి రోజు శనివారం తన తమ్ముడు ముకుంద్‌ను హత్య చేయాలని ప్రయత్నించాడు. అతడిపై కాల్పులు జరిపినప్పటికీ, ముకుంద్ తీవ్ర గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. తండ్రి, అక్క కనిపించడం లేదంటూ ముకుంద్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడిపై దాడి కేసులో ముఖేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, ట్రిపుల్ మర్డర్(Triple Murder) వ్యవహారం బట్టబయలైంది.

నిందితుడు చూపిన సమాచారం ఆధారంగా బావి నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. హత్యలకు ఉపయోగించిన గొడ్డలి, కాల్పులకు వాడిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉండగా, గాయపడిన ముకుంద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

📢 For Advertisement Booking: 98481 12870