ఉత్తర్ ప్రదేశ్‌ను కుదిపేసిన ఉన్నావ్ రేప్(Unnao Case) కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ నేత కుల్దీప్ సెంగార్‌కు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ, ఈ కేసులో మరోసారి సంచలన పరిణామాలకు తెరలేపింది.
Read Also: AP Crime: రైలు ప్రమాద ఘటన.. మృతుడు విజయవాడ వాసి

2017లో ఉన్నావ్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కుల్దీప్ సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సెంగార్, బెయిల్‌తో పాటు మిగిలిన శిక్షను రద్దు చేయాలని కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పాటు శిక్ష రద్దుపై కూడా అనుకూల నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. న్యాయవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతూ పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
బాధితురాలి నిరసన, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా బాధితురాలు ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఆమెతో పాటు ఆమె తల్లి, ఒక సామాజిక కార్యకర్తను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించడం వివాదానికి దారి తీసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో బాధితురాలితో పాటు సీబీఐ కూడా సెంగార్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును(Unnao Case) ఆశ్రయించింది. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం, ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసింది. అంతేకాదు, మిగిలిన శిక్షను ఎందుకు రద్దు చేశారన్న అంశంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. సెంగార్‌కు స్పందించేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట న్యాయంపై రాజీ పడే ప్రశ్నే లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మహిళ తండ్రి కస్టడీలో మరణించిన మరో కేసులో కూడా శిక్ష అనుభవిస్తున్న సెంగార్ జైలులోనే కొనసాగనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: