అవినీతి ఆరోపణలతో అస్సాంలోని ఓ ఉన్నతాధికారి ఇంట్లో సోదాలు నిర్వహించిన సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారులు భారీగా నగదు, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అస్సాం సివిల్ సర్వీసెస్ (ACS) అధికారిణి నూపుర్ బోరా నివాసంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. బ్యాగుల నిండా నోట్ల కట్టలు, బంగారం, వజ్రాలు కనిపించడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు.

సోదాల్లో బయటపడిన అక్రమాలు
సోదాల్లో రూ.90 లక్షల నగదు, కోటి రూపాయలకు పైగా విలువైన బంగారం, వజ్రాలను అధికారులు స్వాధీనం(Possession) చేసుకున్నారు. ఈ మొత్తం దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం కామ్రూప్ జిల్లాలోని గోరోయిమారిలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నూపుర్ బోరాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెపై భూ కుంభకోణం, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.
2019లో అస్సాం(Assam) సివిల్ సర్వీసెస్‌లో చేరిన నూపుర్ బోరా, బార్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు లంచంగా భూమిని తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచారు. ఆమెతో కలిసి పనిచేసిన లాట్ మండల్ సురాజిత్ డేకా నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు?
అస్సాం సివిల్ సర్వీసెస్ అధికారిణి నూపుర్ బోరా.
ఆమె ఇంట్లో ఎంత విలువైన సొత్తు లభ్యమైంది?
రూ.90 లక్షల నగదుతో పాటు, కోటి రూపాయలకు పైగా విలువైన బంగారం, వజ్రాలు దొరికాయి. మొత్తం సుమారు రూ.2 కోట్లు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: