తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మోటాట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకున్న హత్యా ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సొంత అన్నను తమ్ముడే దారుణంగా హత్య చేసిన ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబంలో నెలకొన్న అక్రమ సంబంధాల కారణంగా ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు.
గ్రామానికి చెందిన ఎర్ర రాజు (32) కొంతకాలంగా తన చిన్నమ్మతో సహజీవనం (Adultery) చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన తమ్ముడు శివకుమార్, వావివరసలు మరిచి ఇలా ప్రవర్తించడం తప్పని అన్నతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Read also: Kamareddy crime: యువకుడిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు

నిద్రలో ఉన్న అన్నపై గొడ్డలితో దాడి
వాగ్వాదం అనంతరం నిద్రకు ఉపక్రమించిన ఎర్ర రాజుపై తమ్ముడు శివకుమార్ కోపంతో దాడి చేశాడు. గొడ్డలితో నరికడంతో పాటు, బండరాయితో కొట్టి అత్యంత క్రూరంగా హతమార్చాడు. ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ విభేదాలు, అక్రమ సంబంధాలు ఎంతటి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోందని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: