Suryapet Road Accident: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని వెలిశాల గ్రామ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఈ ఘటనలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also :Borabanda Crime: పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

అదుపుతప్పిన లారీ..
తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ వైపు వెళ్తుండగా, ఎదురుగా తిరుమలగిరి నుండి తొర్రూరు వెళ్తున్న లారీ వెలిశాల గ్రామ శివారులో అదుపుతప్పింది. వేగంగా వచ్చిన లారీ బస్సును నేరుగా ఢీకొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. క్షతగాత్రులలో నలుగురు ప్రయాణికుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను బస్సు నుండి బయటకు తీసి, చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :