2025 సంవత్సరం భారతదేశంలో ఘోరమైన తొక్కిసలాట ఘటనలతో గుర్తుకు వచ్చింది. మతపరమైన వేడుకలు, రాజకీయ ర్యాలీలు, క్రీడా విజయోత్సవాలు, రవాణా కేంద్రాల్లో జరిగిన ఈ ఘటనల్లో వందల మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలు భారీ జనసమూహాలను సక్రమంగా నిర్వహించడంలో దేశంలో ఉన్న లోపాలు, అత్యవసర పరిస్థితులకు సరైన ప్రణాళికల ఆభావాన్ని స్పష్టంగా చూపాయి.
Read also: Nigeria: నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు

2025 Stampedes in India
క్రింది ముఖ్యమైన ఘటనలు
- కరూర్ రాజకీయ ర్యాలీ, తమిళనాడు (సెప్టెంబర్ 27) – 31 మంది మరణాలు; నాయకుడి కాన్వాయ్ వైపు ఒక్కసారిగా జన సమూహం దూసుకువచ్చడంతో ఘోర తొక్కిసలాట.
- ప్రయాగ్ మహా కుంభమేళా (జనవరి 29) – 30 మంది మరణాలు; భక్తులు ‘అమృత్ స్నానం’ కోసం వేచి ఉండగా అడ్డంకులు కూలిపోయి ప్రాణాలు పోయాయి.
- డెల్లీ రైల్వే స్టేషన్ (ఫిబ్రవరి 15) – 18 మంది మరణాలు; ఫుట్‌బ్రిడ్జి crowded, ప్లాట్‌ఫారమ్ అనౌన్స్‌మెంట్లలో గందరగోళం కారణంగా.
- RCB విజయోత్సవం, బెంగళూరు (జూన్ 4) – 11 మంది మరణాలు; ఐపీఎల్ టైటిల్ కోసం భారీ మంది అభిమానులు వచ్చి, సరైన నియంత్రణ లేకపోవడం వల్ల.
- వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీకాకుళం (నవంబర్ 1) – 9 మంది మరణాలు; భక్తుల రద్దీ పెరగడంతో.
- తిరుమల ఆలయ టికెట్ తొక్కిసలాట (జనవరి 8) – 6 మంది మరణాలు; గేట్లను ఆకస్మికంగా తెరవడం కారణం.
- జగన్నాథ రథయాత్ర, పూరీ (జూన్ 29) – 3 మంది మరణాలు; రథయాత్రలో రద్దీ పెరగడం.
ఈ ఘటనలు జాగ్రత్తల లోపం, జనప్రవాహ హెచ్చరికలు లేకపోవడం, మరియు అత్యవసర ప్రతిస్పందన లోపాలను వ్యక్తం చేస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: