ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నారు-కలెక్టర్
మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది
57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారు-కలెక్టర్(Collector)
రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సింగరేణి టీమ్(Singarene Team)
ధృవఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది కార్మికులు
ఏడుగురి పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్స
ధృవ ఆస్పత్రికి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి.
సిగాచిని పరిశీలించిన అనంతరం అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం. పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరా అని ప్రశ్నించిన సీఎం. పరిశ్రమను తనిఖీ చేశారా అని ఫ్యాక్టరీస్ డైరెక్టర్‌ను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. తాజా ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా కొత్త వారితో విచారణ జరిపించాలని ఆదేశం.
