కేరళ రాష్ట్రంలోని శబరిమల (Sabarimala) కొండపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు బస్సులు, వాహనాల ద్వారా శబరిమల యాత్రకు వెళ్తున్నారు. అయితే ఈ యాత్రలో ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Read Also: BC reservations: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కోరుతూ ధర్నా

గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో బస్సు ప్రమాదానికి గురైంది. పథనంతిట్ట జిల్లా వడస్సేరిక్కార ప్రాంతంలో ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. ఏపీ చిలకలూరిపేట నుంచి శబరిమలకు బయలుదేరిన మౌనిక టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు చెందిన చెందిన బస్సు అది.
వడస్సేరిక్కార వద్ద ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పింది బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ యాత్రీకుడి కాలు పూర్తిగా తెగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 49 మంది అయ్యప్పస్వాములు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: