ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) తన అధికారిక నివాసంలో ప్రజల సమస్యలు తెలుసుకునే “జన్ సున్వాయ్” కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒక్కసారిగా అక్కడి వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది.రేఖా గుప్తా ప్రజల సమస్యలు స్వయంగా వింటూ పరిష్కారం చూపేందుకు అధికారిక నివాసంలో ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో వందలాది మంది పౌరులు హాజరై తమ వినతిపత్రాలు సమర్పిస్తుంటారు. మంగళవారం కూడా ఇలాగే ప్రజలు క్యూలలో నిలబడి తమ సమస్యలు చెప్పుకుంటూ ఉండగా, ఒక వ్యక్తి ముందుకు వచ్చి వినతిపత్రం ఇచ్చాడు.

భద్రతా సిబ్బంది
మొదట సాధారణంగానే కనిపించిన అతను,గట్టిగా అరిచి, సీఎం రేఖా గుప్తా చెంపపై కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు పట్టుకుని పీకాడు.ఈ సంఘటన క్షణాల్లోనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే వారు దుండగుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దాడి సమయంలో అక్కడ ఉన్న అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ (Virendra Sachdev), మంత్రి మజిందర్ సింగ్ సిస్రా, ఇతర నేతలు ఈ దాడి వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కాగా, ముఖ్యమంత్రిపై దుండగుడి దాడి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ స్పందించారు. సీఎంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదని ఆమె పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. భద్రతా వైఫల్యంపైనా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.
రేఖా గుప్త ఎవరు? ఆమె చరిత్ర ఏంటి?
రేఖా గుప్త (జిందాల్; జూలై 19, 1974 జననం) భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె 2025 ఫిబ్రవరి నుండి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన రేఖా గుప్త 2025లో శాలిమార్ బాగ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చురుకైన నాయకురాలిగా ఆమె ఢిల్లీ రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: