పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం(Red Sandalwood) దుంగలను అటవీ అధికారుల సమాచారంతో గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన శుక్రవారం వేకువజామున చిత్తూరు జిల్లా, పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో మండలంలో కలకలం రేగింది. గుర్తు తెలియని స్మగ్లర్లు ఒక కారులో రూ.7 లక్షల విలువ చేసే పది ఎర్రచందనం దుంగలను పులిచెర్ల నుంచి కర్ణాటకకు తరలిస్తున్నారు.
Read Also: IND vs SA: తొలి రోజు ఆటలో గెలుపు టీమిండియాదే

పోలీసుల సమన్వయం, స్మగ్లర్లు పరార్
పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం రావడంతో వారు స్మగ్లర్ల(Smugglers) వాహనాన్ని వెంబడించారు. అయితే దుండగులు వాహనాన్ని ఆపకుండా ముందుకు నడపసాగారు, ఈ క్రమంలో మార్గమధ్యలో ఒక వ్యక్తిని ఢీకొట్టబోయారు. ఈ విషయాన్ని పలమనేరు ఎస్‌ఆర్‌వో నారాయణ, పలమనేరు సీఐ మురళీమోహన్, గంగవరం సీఐ పరశురాములకు తెలియజేశారు. దీంతో పోలీసులు అప్పినపల్లి గ్రామస్తులను అప్రమత్తం చేయగా, గ్రామస్తులు అడ్డుకోవడంతో స్మగ్లర్లు శంకరరాయలపేట చెరువు కట్ట కింద వాహనాన్ని నిలిపేసి పరారయ్యారు. అనంతరం అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు ఎర్రచందనం దుంగలను కారుతో సహా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు
అక్రమంగా తరలుతున్న ఎర్రచందనాన్ని పట్టుకోవడంలో ధైర్యం చూపించిన అప్పినపల్లి గ్రామస్తులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా అభినందించారు. గ్రామస్తుల చొరవ, ధైర్యాన్ని ప్రశంసించిన ఆయన, అటవీశాఖ అధికారులు, పోలీసులను కూడా అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: