PM Modi: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేరళలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, శ్రీకందపురం ప్రాంతానికి చెందిన రాజన్ సీ కొత్తూరుపై ఈ కేసు నమోదు చేశారు. ఆయన ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీని దేశద్రోహి అంటూ పోస్టు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Also:Vijayawada Crime: పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం

ఈ విషయం తెలిసిన తరువాత ఒక బీజేపీ వర్కర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా, అధికారులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ కేసును భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 192తో పాటు కేరళ పోలీస్ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: