ట్రాఫిక్ బాధలు లేకుండా మెట్రో వచ్చాక నగరాల్లో ప్రయాణం చాలా సౌకర్యవంతం అయ్యిందని చెప్పవచ్చు. త్వరగా గమ్యస్థానాలకు చేరవచ్చు. పైగా భద్రత విషయంలో ఎలాంటి అనుమానం ఉండదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది మెట్రోకే ఓటేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. నగర శివారు ప్రాంతాల్లో ఉద్యోగం చేసే మహిళలకు మెట్రో(Metro) ఒక వరం అని చెప్పవచ్చు. ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవచ్చు అనే ధైర్యం. కానీ ఇప్పుడు చెప్పబోయే సంఘటన వింటే వామ్మో మెట్రో కూడా సేఫ్ కాదు అనిపిస్తుంది. ఇంతకు ఏం జరిగిందంటే ఓ ప్రబుద్ధుడు మెట్రోలో ప్రయాణించే మహిళలకు తెలియకుండానే వారి ఫొటోలు తీసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నాడు. విషయం కాస్త వెలుగులోకి రావడంతో ఇది సంచలనంగా మారింది.
వివరాలు
ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మెట్రోలో ప్రయాణం చేసే మహిళల అనుమతి లేకుండానే వారిని ఫొటోలు తీయడమే కాక వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం కాస్త వెలుగులోకి రావడంతో అతడిపై పోలీసులు ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేశారు. ఒక ఇన్‌స్టా అకౌంట్ నుంచి మెట్రోలో ప్రయాణం చేస్తున్న కొందరు మహిళల ఫొటోలను పోస్ట్ చేశాడు.దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది.ఈ విషయం వెలుగులోకి రావడంతో వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాక ఆ వ్యక్తి ఇన్‌స్టా పేజ్‌లో ఉన్న ఫొటోలను డిలీట్ చేశారు.ఎక్స్ యూజర్ ఒకరు ఈ ఇన్‌స్టా పేజ్‌ను గుర్తింంచాడు. వెంటనే దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోల గురించి సదరు మహిళలు, యువతులకు ఏం తెలియదు. వారికి తెలియకుండానే ఈ ఫొటోలు తీశారు. వారి అనుమతి లేకుండానే వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

ప్రయాణించే
దీని గురించి వారికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. అంతేకాక మెట్రో రైల్లో ఎవరైనా మొబైల్ చేతిలో పట్టకుని అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వారిని ప్రశ్నించాలని తప్పు చేశారని గుర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.మెట్రోలో ప్రయాణించే మహిళలు, యువతులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Also: Rahul: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మీడియా హైలెట్