हिन्दी | Epaper

Latest Telugu News: Chevella: ఈ పిల్లలకు దిక్కెవరు? ..అమ్మానాన్నల కోసం కన్నీరు మున్నీరు

Vanipushpa
Latest Telugu News: Chevella: ఈ పిల్లలకు దిక్కెవరు? ..అమ్మానాన్నల కోసం కన్నీరు మున్నీరు

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల(Chevella) ఆర్టీసీ బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొని 19 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దంపతుల పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన స్థలంలో నిర్జీవంగా పడిఉన్న తమ అమ్మానాన్నలను చూసుకుంటూ పిల్లలు ఏడుస్తుంటడం అందరినీ కంటతడి పెట్టించింది.

Read Also: Vehicle Challan: చేవెళ్ల బస్సు ప్రమాదం మరిన్ని షాకింగ్ విషయాలు

Chevella Road Accident
Chevella Road Accident

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

ఇక వివరాల్లోకి వెళ్తే సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న RTC ఎక్స్‌ప్రెస్‌ బస్సును కంక లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ ఢీకొంది. బస్సులో కంకర లోడు కూడా పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మరో 20 మంది గాయపడ్డట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు.

క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం

అలాగే క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. అయితే బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. బస్సుపై టిప్పర్ పడిపోవడంతో అది నుజ్జు నుజ్జు అయిపోయింది. దీనికి సంబంధించిన విజువల్స్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చేవెళ్ల ఏ రాష్ట్రంలో ఉంది?
చేవెళ్ల అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ పట్టణం, మండలం మరియు శివారు ప్రాంతం.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోషల్ మీడియాలో వస్తున్న యాడ్‌ మోసాలపై సజ్జనార్ హెచ్చరిక

సోషల్ మీడియాలో వస్తున్న యాడ్‌ మోసాలపై సజ్జనార్ హెచ్చరిక

తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
0:21

తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

దొంగతనం నెపం.. అవమాన భారంతో ఆత్మ హత్య

దొంగతనం నెపం.. అవమాన భారంతో ఆత్మ హత్య

కారు అదుపుతప్పి దంపతుల దుర్మరణం!

కారు అదుపుతప్పి దంపతుల దుర్మరణం!

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్

రీఫండ్ కోసం ప్రయత్నించి రూ. 98 వేలు పోగొట్టుకున్న మహిళ!

రీఫండ్ కోసం ప్రయత్నించి రూ. 98 వేలు పోగొట్టుకున్న మహిళ!

హైదరాబాద్‌లో 800 కిలోల కుళ్ళిన చికెన్ పట్టివేత
0:17

హైదరాబాద్‌లో 800 కిలోల కుళ్ళిన చికెన్ పట్టివేత

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
2:22

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

మీకు తెలుసా ? గూగుల్ లో ఇలా సెర్చ్‌ చేస్తే ఇక జైలుకే

మీకు తెలుసా ? గూగుల్ లో ఇలా సెర్చ్‌ చేస్తే ఇక జైలుకే

శంషాబాద్‌లో 74 డ్రోన్లు సీజ్.. సింగపూర్ నుంచి తెచ్చిన ముగ్గురు అరెస్ట్!

శంషాబాద్‌లో 74 డ్రోన్లు సీజ్.. సింగపూర్ నుంచి తెచ్చిన ముగ్గురు అరెస్ట్!

రీల్స్ పిచ్చి.. గన్ తో షూట్ చేసుకున్న యువకుడు
0:19

రీల్స్ పిచ్చి.. గన్ తో షూట్ చేసుకున్న యువకుడు

యూట్యూబర్ వైష్ణవి.. గర్భిణి అని చూడకుండా చంపిన భర్త

యూట్యూబర్ వైష్ణవి.. గర్భిణి అని చూడకుండా చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870