हिन्दी | Epaper

UttarPradesh:ప్రియుడితో కలిసి భర్తను హత మార్చిన నవవధువు

Anusha
UttarPradesh:ప్రియుడితో కలిసి భర్తను హత మార్చిన నవవధువు

ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో పెళ్లయిన రెండు వారాలకే భర్తను హత్య చేసేందుకు భార్య తన ప్రియుడితో కలిసి పన్నిన కుట్ర స్థానికంగా సంచలనం రేపింది.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నిందితులు ప్రగతి యాదవ్(22), అనురాగ్ యాదవ్ ఇద్దరూ నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే, వీరి పెళ్లికి ప్రగతి తల్లిదండ్రులు నిరాకరించారు.కుటుంబ ఒత్తిడితో, ఈ నెల 5న ప్రగతిని బలవంతంగా దిలీప్ అనే యువకుడితో వివాహం చేయించారు.పెళ్లయిన తర్వాత తన ప్రియుడిని వదిలి భర్తతో జీవించడం ప్రగతికి ఇష్టం లేక, దిలీప్‌ను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.

కాంట్రాక్ట్ కిల్లర్

బాధితుడి భార్య, ఆమె ప్రియుడు కలిసి దిలీప్ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది. వివాహం తర్వాత ఇద్దరూ కలుసుకునేందుకు వీలు లేకపోవడంతో దిలీప్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షలు చెల్లించారు.రామాజీ మరికొందరితో కలిసి బైక్‌పై దిలీప్‌ను పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ దిలీప్‌పై దాడి చేశారు. ఆ తర్వాత తుపాకితో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు తుపాకులు, నాలుగు లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్స్, ఆధార్‌కార్డు, రూ. 3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

pragati 1742877051901 1742877056659

పోలీసుల దర్యాప్తు

తీవ్ర గాయాలతో బాధపడుతున్న దిలీప్‌ను పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం అతడిని మరో మూడు ఆసుపత్రులకు తరలించారు. కానీ, తీవ్ర గాయాల కారణంగా ఈ నెల 20న ఔరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దిలీప్ మృతి చెందాడు.ప్రగతి తన ప్రియుడి కోసం భర్తను హత్య చేయించడం, హత్యలో పూర్తిగా పాత్ర పోషించడం ఆమె జీవితాన్ని నాశనం చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870