Nagarkurnool Crime: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, ప్రేమ పేరుతో తోటి విద్యార్థినులను నమ్మించి వంచించాడు. ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, వారి తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.
Read Also: Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
గర్భం దాల్చిన బాధితురాలు.. గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్
నిందితుడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాళ్లలో ఒకరు ధైర్యం చేసి విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు సదరు విద్యార్థిని పట్టుకుని దేహశుద్ధి చేసి, అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి. బాధితుల్లో ఒక బాలిక గర్భం దాల్చగా, కొల్లాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్లు నిందితుడు అంగీకరించాడు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసినందుకు సదరు ప్రైవేట్ ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను బుధవారం సీజ్ చేశారు. గురువారం ఇద్దరు డాక్టర్లు, ఒక నర్సును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడైన విద్యార్థిని జువైనల్ హోంకు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: