ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో జరిగిన ఈ దారుణ సంఘటన అందరిని కలిచివేసేలా చేసింది. తమ్ముళ్ల కోసం పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసిన అన్న అదే తమ్ముడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. అయితే సొంత తమ్ముడే అతన్ని కొట్టి చంపి హైడ్రామా క్రియేట్ చేశాడని గుర్తించారు.

ఘటన వివరాలు
తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో తన తమ్ముళ్లు బుల్లబ్బాయి, రాజేంద్రప్రసాద్ ల బాధ్యత తన భుజాలపై చేసుకున్న విజయబాబు పెళ్లి కూడా చేసుకోలేదు. తన తమ్ముళ్లే జీవితమని వాళ్ల కోసమే జీవిస్తున్నారు. కానీ మద్యానికి బానిసైన బుల్లబ్బాయి తాగడానికి డబ్బులు ఇవ్వలేదని అన్నను హతమార్చాడు. తన జీవితాన్ని తన తమ్ముల భవిష్యత్తు కోసం అర్పించి, పెళ్లి చేసుకోకుండా వారి కోసం సత్కరిస్తున్న విజయ్ బాబు, ఇప్పుడు అదే తమ్ముడి చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇద్దరు తమ్ముళ్ల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన విజయ్ బాబు అదే తమ్ముడు చేతిలో హత్యకు గురవడం ఇక్కడ ప్రతి ఒక్కరు హృదయాలను చలింప చేసింది. పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టారు. బుధవారం(ఏప్రిల్ 9) రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో తనకు డబ్బులు కావాలని అన్న విజయబాబును డిమాండ్ చేశాడు. కానీ డబ్బులు లేవని గట్టిగా మందలించడంతో నిద్రమత్తులో ఉన్న అన్నను అతి దారుణంగా ఇనుపరాడ్డుతో కొట్టి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, తెల్లవారగానే అతని తమ్ముడు పోలీసులకు సమాచారం అందించాడు. తన అన్నను ఎవరో చంపారని, నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి హతమార్చారని పోలీసులను నమ్మించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరని ఆరా తీశారు. చివరకు అదంతా హైడ్రామా అని గుర్తించారు. సొంత తమ్ముడు బుల్లబ్బాయి హంతకుడని తేల్చారు. చివరికి బుల్లబ్బాయిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినప్పుడు ఆ హత్య వెనుక ఉన్న అసలైన నిజాలు బయటపడ్డాయి. ఈ సంఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది, ఎందుకంటే విజయ్ బాబు తన జీవితాన్ని తమ్ముల కోసం అర్పించి, తన తమ్ముడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.
Read also: Murder: స్నేహితుడిని కొట్టి చంపినా యువకులు