నావీ ముంబైలో(Mumbai crime) ఒక తీరని దారుణం చోటుచేసుకుంది. కొడుకు కావాలన్న కోరికతో, సుప్రియా మహామున్కర్ (30) తన ఆరేళ్ల కుమార్తె మాన్సిని ఘాతకంగా హత్య చేసింది. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమెను కలంబోలి పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Bihar: పసిపిల్లల ప్రాణాలు తీసిన చలి మంట

కలంబోలి ప్రాంతంలోని గురు సంకల్ప్ సొసైటీలో నివసిస్తున్న సుప్రియా, ఈ నెల 23న తన కుమార్తె మాన్సి అనారోగ్యంతో చనిపోయిందని పోలీసులకు తెలిపింది. అయితే చిన్నారి మృతిపై అనుమానం వ్యక్తం(Mumbai crime) అయిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. దాంతో ఊపిరాడకుండా చేయడం వల్లే చిన్నారి చనిపోయినట్లు తేలడంతో హత్య కేసు నమోదు చేశారు.
తల్లి నేరాన్ని ఒప్పుకుంది
అదుపులోకి తీసుకున్న తర్వాత సుప్రియా తన నేరాన్ని అంగీకరించింది. కొడుకు కావాలనే కోరికకే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని, అదేవిధంగా తన కుమార్తె మాటలు స్పష్టంగా లేవని, హిందీ మాత్రమే మాట్లాడుతుండటంతో అసంతృప్తిగా ఉన్నానని ఆమె తెలిపింది. పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం, సుప్రియా 2024 నుండి డిప్రెషన్ చికిత్స తీసుకుంటోంది.
2019లో కూడా పాప నెలల వయసులో ఉన్నప్పుడు ఆమె ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించిందని భర్త ప్రమోద్ పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం సుప్రియను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు పోలీస్ కస్టడీ విధించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: