Mulugu Road Accident: ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా చూసేందుకు వీరభద్రరాజు (52) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరిన సమయంలో ఎదురుగా వచ్చిన క్రేన్ లారీ అకస్మాత్తుగా వారి వాహనాన్ని ఢీకొట్టింది.
Read Also: Telangana: దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్

ఈ ప్రమాదం(Fatal Accident)లో వీరభద్రరాజు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో నలుగురు తీవ్ర గాయాలకు గురికావడంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సినిమా సందడి కోసం వెళ్లిన కుటుంబంపై ఒక్కసారిగా విషాదం ముసురుకుంది. ప్రమాద సమాచారం తెలియగానే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, క్రేన్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: