ఇండోర్‌కు చెందిన,రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.హనీమూన్ కోసం భార్య సోనమ్‌తో కలిసి మేఘాలయ వెళ్లిన రఘువంశీ(Raja Raghuvanshi)హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ కేసులో అతడి భార్య సోనమ్ రఘువంశీ సహా మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.రాజా హత్యకు సోనమ్ ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు అనుమాస్తున్నారు. జూన్ 8న ఆమెను ఉత్తర్ ప్రదేశ్‌లోని గాజీపూర్‌లో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మేఘాలయ నుంచి ఆమె యూపీకి ఎందుకు వెళ్లింది? ఎలా వెళ్లింది? అనేది ఇంకా తెలియరాలేదు. ఈ క్రమంలోనే సోనమ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
అంగీకరించకుంటే
సోనమ్, రాజా రఘువంశీల వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి ట్రెండింగ్‌లో ఉంది. ఎక్స్ (ట్విట్టర్)లో ఓ నెటిజన్ వీడియోను షేర్ చేస్తూ ‘సోనమ్, రాజా రఘువంశీల వివాహ వీడియోను ఓ సారి చూడండి.ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకోవడం లేదని మీరూ ఒప్పుకుంటారు. సోనమ్ ఈ పెళ్లికి అంగీకరించకుంటే రాజా ప్రాణాలతో ఉండేవాడు. సుపారీ హంతకులతో చంపించే ధైర్యం ఉంది కానీ, ప్రియుడితో వెళ్లిపోయే ధైర్యం లేదా? ఆమె సైకోలా ఉంది. ఇందులో సోనమ్ అమ్మానాన్నల తప్పుకూడా ఉంది.కుమార్తె ప్రేమించిన విషయం ముందే తెలిసి ఉండాలి. ఈ విషయం రఘువంశీకి చెప్పకుండా పెళ్లి చేశారు’ అని పేర్కొన్నాడు.
ఆగ్రహం
నెటిజన్ షేర్ చేసిన ఆ వీడియోలో సోనమ్ నుదుట రఘువంశీ సిందూరం పెడుతుంటే ఆమె ముఖంలో ఎలాంటి సంతోషం లేదు బాధపడుతూ నేలవైపు చూస్తూ ఉంది. మొత్తం 15 సెకన్ల ఈ వీడియోలో రాజా చాలా హ్యాపీగా ఉన్నాడు. సోనమ్(Sonam) మాత్రం తనకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుగానే కూర్చుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు స్పందిస్తూ సోనమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని అతడి ప్రాణాలు తీసిందని, ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదని దుమ్మెత్తి పోస్తున్నారు.
Read Also: Bengaluru: భర్త పిల్లల్ని వదిలేసివచ్చిన.. ప్రియురాలిని చంపేసిన ప్రియుడు