Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పరీక్షలో జవాబులు చూపలేదనే చిన్న కారణంతో పదో తరగతి చదువుతున్న రిషి అహిర్వర్ అనే విద్యార్థిని అతని సహ విద్యార్థులే అతి దారుణంగా హత్య చేశారు.
Read Also: Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్
8 మంది విద్యార్థుల దాడి.. అతి దారుణంగా..
చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన రిషిని సుమారు ఎనిమిది మంది విద్యార్థులు చుట్టుముట్టి కత్తితో దాడి చేశారు. దీంతో రిషి చేతిపై తీవ్ర గాయం కావడంతో అధిక రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: