హైదరాబాద్‌లోని(Hyderabad) కేపీహెచ్‌బీ(KPHB) పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని కలచివేసింది. ఫ్లైఓవర్‌పై నెమ్మదిగా వెళ్తున్న ఓ కారును వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బైక్‌పై ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నారు. అతివేగంగా వస్తున్న బైక్ అకస్మాత్తుగా ముందు వెళ్తున్న కారును ఢీకొనడంతో బైక్ అదుపు తప్పింది. ఈ ఢీకొట్టుడు తీవ్రంగా ఉండటంతో బైక్‌పై ఉన్న ఓ యువకుడు గాల్లోకి ఎగిరిపడి రోడ్డుపై బలంగా పడిపోయాడు. తీవ్ర గాయాల కారణంగా అతను సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు.
Read also: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ప్రమాదంలో మరో యువకుడు
మరో యువకుడు(KPHB) కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: