కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకొంది.మర్కొనహళ్లి ఆనకట్ట వద్ద జరిగిన ఈ ఘటన స్థానికులను, కలచివేసింది. రదాగా గడపాలని పిల్లలతో పిక్నిక్‌కు వచ్చిన ఓ కుటుంబంపైకి ఊహించని విపత్తు వచ్చి పడింది.
Jaipur LPG Blast: జైపూర్–అజ్మీర్ LPG లారీ పేలుడు
మర్కోనహళ్లి డ్యామ్ (Markonahalli Dam) గేట్లు అకస్మాత్తుగా తెరుచుకోవడంతో.. నలుగురు పిల్లలు సహా ఇద్దరు మహిళలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. మొత్తంగా ఏడుగురు గల్లంతు కాగా.. అందులో ఆరుగురు మృతి చెందారు. మరొకరికి కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తున్నాయి.తుమకూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) అశోక్ కె.వి. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు.
పిక్నిక్ కోసం సుమారు 15 మంది సభ్యులు డ్యామ్ (Dam) ప్రాంతానికి వచ్చారని అన్నారు. వీరిలో ఏడుగురు నీటిలోకి దిగి ఆడుకుంటున్నట్లు తెలిపారు. అయితే అకస్మాత్తుగా డ్యామ్‌లోని సైఫన్ సిస్టమ్ తెరుచుకోవడంతో.. ఒక్కసారిగా డ్యామ్ నుంచి శక్తివంతమైన నీటి ప్రవాహం కిందకు దూసుకువచ్చిందని చెప్పారు.

ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికి
అయితే విషయం గుర్తించని నీటిలో ఉన్న ఆ ఏడుగురు.. నీటి ఉద్ధృతికి తట్టుకోలేక కొట్టుకుపోయారని పేర్కొన్నారు.అయితే అక్కడే ఉన్న మిగతా వాళ్లు వెంటనే స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు.
దీంతో హుటాహుటిన రంగంలోకి దిగి.. నీటిలో గల్లంతు అయిన వారిని రక్షించే ప్రయత్నం చేశామన్నారు. ఈక్రమంలోనే నవాజ్ అనే ఓ వ్యక్తిని క్షేమంగా బయటకు తీసుకు వచ్చామని చెప్పారు. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ఆరుగురు గల్లంతు కాగా.. అందులో ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికి తీసినట్లు స్పష్టం చేశారు. గల్లంతైన మరో నలుగురి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు వెల్లడిచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: