జనగామ జిల్లా లింగాల ఘన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Jangaon accident: జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం(Lingala Ghanpur Mandal) నవాబ్ పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వారిని ఓ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: