हिन्दी | Epaper

Hyderabad: ఒకే కుటుంబంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

Sharanya
Hyderabad: ఒకే కుటుంబంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదకర ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్‌ (Balapur Police Station) పరిధిలో చోటు చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, అక్కాచెల్లెళ్లు, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే:

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన ఓ దంపతులు జీవనోపాధి కోసం ఇటీవల హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఈ క్రమంలో బాలాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె వినీలా (17) చిన్న కుమార్తె అఖిల (16) ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె మూడు నెలల క్రితం ఓ యువకుడిని ప్రేమించి అతనితో ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు పెద్దలను సంప్రదించడంతో పంచాయితీ పెట్టారు. వయస్సు లేదని కులాంతర వివాహం వద్దని పెద్దల సమక్షంలో అమ్మాయికి నచ్చజెప్పి తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.

ఉరి వేసుకుని ఆత్మహత్య

అప్పటి నుంచి ఇంట్లో ఒత్తిడి వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు తరచూ మందలించటం, వినీలా–అఖిలలపై నిఘా పెట్టడం మొదలయ్యాయి. ఇద్దరు అమ్మాయిలు తమ మాట వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిండటంతో తల్లిదండ్రులు వారి ఇద్దరిని మందలించారు. దీంతో వినీలా, అఖిల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ రెయిలింగ్ కు చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసుల స్పందన:

స్థానికుల సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రాథమిక వివరణ ఆధారంగా, ఇంట్లో నడిచిన మాటా మాండవ్యాలు, ఒత్తిళ్లే ఈ దారుణానికి దారితీసినట్లు అనుమానిస్తున్నారు.

Read also: TGSRTC: నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెంపుడు పిల్లులు కాదు పులులు.. వృద్ధురాలిని పీక్కుతిన్నాయి

పెంపుడు పిల్లులు కాదు పులులు.. వృద్ధురాలిని పీక్కుతిన్నాయి

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం

రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం

తెలంగాణలో రూ. 84. 15 కోట్ల జీఎస్టీ స్కామ్?.. నిందితుడు అరెస్ట్!

తెలంగాణలో రూ. 84. 15 కోట్ల జీఎస్టీ స్కామ్?.. నిందితుడు అరెస్ట్!

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం..10 మందికి పైగా తీవ్ర గాయాలు

భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం..10 మందికి పైగా తీవ్ర గాయాలు

విదేశీ విద్య పేరిట కన్సల్టెన్సీ మోసం

విదేశీ విద్య పేరిట కన్సల్టెన్సీ మోసం

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!
0:18

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

బాలికపై లైంగిక దాడి.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

బాలికపై లైంగిక దాడి.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

📢 For Advertisement Booking: 98481 12870