Hyderabad: పోలీసుల సమాచారం ప్రకారం గుంటూరు (Guntur) కు చెందిన ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే కోర్సును ఆపివేసింది. అనంతరం ల్యాంకోహిల్స్ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. సోమాజిగూడలోని కపాడియా లైన్‌లో తన స్నేహితులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలోనే అదే కంపెనీలో పనిచేసే భానుప్రకాష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఆ పరిచయం ప్రేమగా మారింది. మొదట్లో సాదాసీదా ప్రేమగా మొదలైన ఈ బంధం, ఆ తర్వాత హింసాత్మక దిశగా మారింది.
Read also: Bangalore: మద్యం మత్తులో విగ్రహాన్ని చెప్పుతో కొట్టిన వ్యక్తి

Hyderabad: ప్రేమికురాలిపై లైంగిక దాడి..
Hyderabad: ఇద్దరి మధ్య చిన్నచిన్న విభేదాలు తలెత్తిన తర్వాత భానుప్రకాష్ సైకోలా ప్రవర్తించడం ప్రారంభించాడు. బాధితురాలిని తరచూ వేధించి, బెదిరించేవాడు. ఆమె స్నేహితులతో కలవడమే కాకుండా బయటకు వెళ్లడంపై కూడా నియంత్రణ చూపేవాడు. ఈ నెల 26న రాత్రి 2:30 సమయంలో ఆమె ఫ్లాట్‌కు వెళ్లి రూమ్‌మేట్స్‌ను బెదిరించి గదిలో బంధించాడు. అనంతరం యువతిపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అంతేకాదు ఆమెను కత్తెరతో గాయపరిచి, చేతివేళ్ల గోర్లు కత్తిరించాడు. విషయం ఎవరికైనా చెబితే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితురాలు మరుసటి రోజు స్నేహితుల సహాయంతో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు భానుప్రకాష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: