Travel Company: హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం బయటపడింది. ఓ ట్రావెల్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉన్న చిన్న సాఫ్ట్‌వేర్ (software) లోపాన్ని ఉపయోగించి దొంగలు భారీ కుంభకోణం సృష్టించారు. బుక్ చేసిన వెంటనే టికెట్ రద్దు చేసే విధానాన్ని దుర్వినియోగం చేసి, కంపెనీ డిజిటల్ వాలెట్ నుంచి సుమారు రూ.3 కోట్లకు పైగా నగదు ఎగవేశారు. ఈ మోసం మూడు నెలల కాలంలో జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై ఆందోళన చెందిన ట్రావెల్ కంపెనీ అంతర్గతంగా ఆడిట్ నిర్వహించగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
Read also: AP Crime: మైనర్ బాలికపై లైంగిక దాడి – టీచర్ అరెస్టు

Travel Company
Travel Company: వెంటనే కంపెనీ యాజమాన్యం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో నిందితులుగా చెన్నుపాటి శివన్నారాయణ, కడలి నారాయణస్వామి, అనుగుల రాజ్‌కుమార్, జడ్డ బ్రహ్మయ్య, పెరిచెర్ల వర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రారంభ విచారణలో ట్రావెల్ సంస్థలోని కొంతమంది ఏజెంట్లు కూడా ఈ మోసంలో పాత్ర వహించినట్టు బయటపడింది. ఈ కేసు సైబర్ నేరాల పెరుగుతున్న దోరణిని మరోసారి బయటపెడుతోంది. సాంకేతిక లోపాలను ఉపయోగించి కంపెనీలకు భారీ నష్టం కలిగిస్తున్న నేరస్తులపై మరింత పర్యవేక్షణ అవసరం ఉందని పోలీసులు హెచ్చరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: