हिन्दी | Epaper

Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త

Anusha
Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త

అనుమానం ఒక కుటుంబాన్ని నాశనంచేసింది.భార్యను కోల్పోయేంత పరాకాష్టకు ఓ భర్త చేరుకున్నాడు.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

అనుమానం పెనుభూతం

అంబర్‌ పేట పటేల్‌ నగర్‌ బిలాల్‌ మజీదు బస్తీకి చెందిన నవీన్‌ (32), రేఖ (28) భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మారుడు (5), కుమార్తె (3) ఉన్నారు. నవీన్‌ స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎంతో సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భార్య రేఖపై అనుమానం పెంచుకున్న నవీన్‌ తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో పెద్దలు కల్పించుకుని ఇద్దరికీ సర్దిచెప్పడంతో కొన్నాళ్లు బాగానే ఉన్నా.. నవీన్‌కు భార్యపై అనుమానం మాత్రం దూరం కాలేదు.ఈ క్రమంలో నవీన్‌ మళ్లీ వేధించసాగాడు.

దంపతుల మధ్య గొడవ

మార్చి 10వ తేదీ రాత్రి దంపతుల మధ్య మళ్లీ గొడవపడటంతో కోపోద్రిక్తుడైన మద్యం మత్తులో భార్య రేఖను అంతమొందించాలని అనుకున్నాడు.తన బైక్‌లో ఉన్న పెట్రోల్‌ తెచ్చి అమాంతం భార్య రేఖపై పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కాసేపటి తర్వాత మంటలు ఆర్పివేసిన నవీన్‌ అత్తమామాలకు ఫోన్‌ చేసి రేఖ ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపాడు.

reka V jpg 442x260 4g

నమ్మించే ప్రయత్నం

ఆస్పత్రిలో చేర్చించానని, చికిత్స అందిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడికి పరుగు పరుగున వచ్చిన రేఖ తల్లిదండ్రులు కూతురుని చూసుకుని కుమిలిపోయారు. తీవ్రంగా కాలిపోయిన రేఖ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది.

కేసు నమోదు

మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నవీన్‌ను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు.కుటుంబ కలహాలు, అనుమానం, మద్యం మత్తులో జరిగే హింస ఇలా ఎన్నో విషాద ఘటనలకు దారితీస్తున్నాయి.అనుమానంతో బాధపడే వ్యక్తులు కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాలి. భార్యాభర్తలు పరస్పర నమ్మకంతో జీవనం సాగించాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870