గుజరాత్ పాటన్ జిల్లా సంతాల్‌పుర్ తాలూకా జఖోట్రా గ్రామానికి చెందిన వ్యక్తితో 22 ఏళ్ల గీతా అహిర్‌కు గతంలోనే పెళ్లి జరిగింది. అయితే ఇప్పటికే వివాహం అయి భర్తతో కలిసి ఉన్న ఆమె అదే మండలానికి చెందిన 21 ఏళ్ల భరత్(Bharat)తో ప్రేమలో పడింది. భర్తకు తెలియకుండానే చాటుమాటుగా ప్రేమాయణం సాగించింది.వివాహేతర సంబంధం కూడా నడిపించింది. అయితే ఇలా దొంగచాటుగా జీవితాంతం కలిసి ఉండడం కష్టం అని ప్రియుడితోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంది. కానీ తానలా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతే ఇటు మెట్టినిళ్లు, అటు పుట్టింటి వాళ్లు కచ్చితంగా తన కోసం వెతుక్కుంటూ వస్తారని భావించింది.అలా జరగకుండా ఉండాలంటే తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించాలనుకుంది. అదే విషయాన్ని ప్రియుడు భరత్‌కు చెప్పింది. అందుకోసం ఓ అద్భుతమైన ప్లాన్ కూడా వేసింది. ఎవరైనా అనామకులను చంపి ఆ మృతదేహానికి తన డ్రెస్సు, పట్టీలు పెట్టి పెట్రోల్ పోసి మరీ కాల్చేయాలని నిర్ణయించుంది. ఇందుకోసం ఎవరినైనా చంపాలని ప్రియుడు భరత్‌కు చెప్పగా అతడు రోడ్డుపై వెళ్తున్న 56 ఏళ్ల అమాయక వ్యక్తి హర్జీభాయ్ సోలంకిని హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని జఖోట్రా గ్రామ(Zakhotra village) శివారుకు చేర్చాడు. అందురూ పడుకున్నాక గీతా అహిర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఆమె ఎవరి కంటా పడకుండా ఇంటి నుంచి వచ్చేసింది.
పరిశీలించి
ఆపై తన డ్రెస్సును మృతదేహానికి వేసింది. అలాగే తన కాళ్లకు ఉన్న పట్టీలు తీసి అతడికి తొడిగింది. ఆ తర్వాత శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి జారుకున్నారు. అయితే ఉదయం లేచే సరికి గీతా అహిర్(Geeta Ahir) కనిపించకపోవడంతో భర్త కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు. ఊరంతా వెతకగా చివరకు గ్రామ శివారు వద్ద ఓ మృతదేహం కాలిపోయిందని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. సగం కాలిన డ్రెస్సు, పట్టీలు చూసి ముందుగా గీత మృతదేహమే అనుకున్నారు. అంత్యక్రియలు కూడా చేయాలనుకున్నారు. కానీ శవాన్ని పరిశీలించి చూడగా అది ఓ పురుషుడి మృతదేహం అని గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దర్యాప్తు
ఇలా పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పురుషుడి మృతదేహానికి గీతా అహిర్ బట్టలు ఉండగా ఆమే ఏదైనా తప్పు చేసి ఉంటుందని ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆమె ఎక్కువగా ఎవరితో ఫోన్ మాట్లాడిందో చూసి ఆ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఈమె పాలన్‌పుర్ రైల్వే స్టేషన్లో(Palanpur railway station) ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వెళ్లి గీతా అహిర్ సహా ఆమె ప్రియుడు భరత్‌ను అరెస్ట్ చేశారు. తమదైన స్టైల్లో విచారించగా వీరిద్దరూ తాము చేసిన తప్పును ఒప్పుకున్నారు.
Read Also: Sexually Assaulted: చిన్నారులపై వైద్యుడి అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష