కృష్ణా జిల్లా గుడివాడలో ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ నివాసంలో భారీ చోరీ కలకలం రేపింది. ఆయన సతీమణి మధురిమ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన సమయంలో దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బుధవారం ఆమె తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండటంతో షాక్‌కు గురయ్యారు. ఇంట్లోని సామాగ్రి అంతా కింద పడేసి ఉండటాన్ని గమనించిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Adulterated Ginger Garlic Paste: ఖైరతాబాద్‌లో భారీ కల్తీ దందా సీజ్!

Gudivada Crime: Major Burglary at Former Minister Katari’s Residence
పది కిలోల వెండి వస్తువుల మాయం
దొంగలు పక్కా ప్లాన్‌తో ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. సుమారు 10 కిలోల బరువున్న వెండి వస్తువులతో పాటు పూజా సామాగ్రిని కూడా దొంగిలించారు. నిందితులు సోమవారం లేదా మంగళవారం రాత్రి సమయంలో గోడ దూకి లోపలికి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈశ్వర్ కుమార్ వ్యాపార పనుల మీద హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లో ఎక్కువగా ఉంటున్న సమయాన్ని దొంగలు ఆసరాగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
రంగంలోకి దిగిన క్లూస్ టీం
మధురిమ ఫిర్యాదు మేరకు గుడివాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం నిందితుల వేలిముద్రలు మరియు ఇతర కీలక ఆధారాలను సేకరించింది. గతంలో మంత్రిగా పనిచేసిన కఠారి ఈశ్వర్ కుమార్, ఇటీవల రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ భారీ దొంగతనం స్థానికంగా పెను సంచలనంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: