హైదరాబాద్ జీడిమెట్ల(Hyderabad, Jeedimetla)లో 10వ తరగతి చదువుతున్న బాలిక తన తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తల్లిని చున్నీతో గొంతునులిమి, సుత్తితో తలపై కొట్టి చంపిన కూతురు చర్యలవెనుక 8 నెలల సోషల్ మీడియా(Social Media) ప్రేమ కథ దాగి ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం… ఇంట్లో హత్యతో ముగిసిన బంధం
తల్లికి నచ్చని యువకుడితో ప్రేమ పేరుతో జతకట్టిన బాలిక.. అతడి సూచనల మేరకు తల్లిని అడ్డుగా చూస్తూ హత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికను ప్రలోభపెట్టిన యువకుడిపై ఇప్పటికే పోక్సో(Posco) కేసు నమోదు కాగా, పోలీసులు చర్యలు తీసకపోవడం విషాదాంతానికి దారి తీసింది.

పోలీసుల నిర్లక్ష్యమే అసలు కారణం అంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ
మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. నిందితుడిపై చర్యలు తీసుకుని ఉంటే ఈ హత్య జరగేదే కాదని వారు మండిపడుతున్నారు. కేవలం నోటీసు ఇచ్చి వదిలేయడం వల్లే ఈ సంఘటన జరిగింది అంటూ బాలానగర్ డీసీపీ, ఏసీపీ, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌లపై ఆరోపణలు చేశారు.
సీపీ విచారణ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఈ హత్యపై సీపీ ప్రత్యేక విచారణ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబం డిమాండ్ చేసింది. ప్రజల్లో న్యాయం పట్ల నమ్మకం నిలిపేందుకు పోలీస్ వ్యవస్థ పునర్నిర్మాణం అవసరం అని వారు స్పష్టం చేశారు.
మంద కృష్ణ మాదిగ, వెన్నెల గద్దర్ పరామర్శ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగింది అంటూ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఈ హత్యకు బాలానగర్ డీసీపీ, ఏసీపీ, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ పరోక్షంగా కారణమయ్యారని మండిపడుతున్నారు. వెంటనే ఈ ఘటనపై సీపీ విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై ఎమ్మర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ స్పందించారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇందులో భాగంగానే అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగిందని అన్నారు.
Read Also: Jogulamba Gadwala: భర్తను చంపిన నవ వధువు.. కేసులో విస్తుపోయే విషయాలు