స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా ఇంకా మహిళలకు స్వేచ్ఛ రాలేదనిపిస్తోంది. ఎందుకంటే మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు కామంధులు వారిని వదలిపెట్టడం లేదు. అత్యాచారాలకు పాల్పడుతూ మహిళల్ని (Women) కించపరుస్తున్నారు. స్త్రీ అర్థరాత్రి ఒంటరిగా బయట తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ ఏనాడో అన్నారు. స్త్రీలు అన్నిరంగాల్లో ప్రవేశించి, తమదైన విజయాలను (Achievements) పొందుతున్నా ఇంకా వారిపై లైంగిక వేధింపులు తగ్గడం లలేదు. సైన్యం చేర దేశరక్షణకోసం పాటుపడుతున్నా వారికి మాత్రం సరైన రక్షణ దొరకడం లేదు. ఇందంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? రేపు మనం స్వాతంత్ర్యదినోత్స వాన్ని జరుపుకోబోతున్నాం. ఇలాంటి సంతోషకరమైన పండుగసన్నివేశంలో ఓ యువతిపై 10మంది సామూహిక అత్యాచారానికి పాల్పడితే వారిని ఏం చేయాలి? ఈ సంఘటనకుసంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రేమ పేరుతో మోసం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ ఒవైసీ అనే వ్యక్తి ఓ యువతి(18)తో ప్రేమలో పడ్డాడు. ప్రేమ పేరుతో ఆ యువతిని లొంగదీసుకుని, శారీరకంగా దగ్గరయ్యాడు. అనంతరం స్నేహం పేరుతో ఒవైసీ స్నేహితులు ముత్యాల పవన్ కుమూర్, బొద్దుల శివకుమార్, అబ్దుల్ ఖయ్యూం, పుస్తకాల సాయితేజ, ముత్తడి సుమంత్రెడ్డి, గుండ సాయిచరణ్ రెడ్డి, ఓరుగంటి సాయిరాం, నెల్లుట్లకు చెందిన నూకల రవి, పసరమడ్లకు చెందిన జెట్టి సంజయ్ ు ఆ యువతికి దగ్గరయ్యారు.

పెళ్లి పేరుతో గోవాకు తీసుకెళ్లిని ప్రియుడు
కాగా ఈ సంవత్సరం జూన్నెలలో మాట్లాడుకుందాం అని పిలిచి యువతిని జనగామలోని ఒక రూముకి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే యువతి భయంతో ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పకపోవడంతో దీన్ని అలుసుగా తీసుకున్న ప్రియుడు, పెళ్లి చేసుకుందామని నమ్మించి గోవాకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను శారీరకంగా వాడుకొని వదిలేసాడు. దీంతో దిక్కుతోచని యువతి ఎలాగో ఒకలాగా సొంత ఊరికి వచ్చి, తన పిన్ని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు యువతిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించి, 10మంది యువకులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
ప్రేమ పేరుతో మోసపోకండి :పోలీసులు
కాగా ఇటీవల కాలంలో ప్రేమపేరిట పలు మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా గుడ్డిగా ప్రేమపేరుతో వారు ఎక్కడికి రమ్మంటే అక్కడి వె
శ్లేవిషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి అమ్మాయిలు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న కష్టం వచ్చినా తల్లిదండ్రులకు
కుటుంబ సభ్యులకు చెప్పుకుంటే సమస్యలకు పరిష్కారం వారే చూసుకుంటారు అని పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
Read also:hindi.vaartha.com
Read also: