Ganesh Chavan case : కోటి రూపాయల జీవిత బీమా డబ్బు కోసం ఒక వ్యక్తి చేసిన దారుణం మహారాష్ట్రలో కలకలం రేపింది. తాను చనిపోయినట్టు నమ్మించేందుకు అమాయకుడైన ఒక హిచ్‌హైకర్‌ను సజీవ దహనం చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులు అతడు మరణించాడని శోకసంద్రంలో ఉండగా, ప్రియురాలికి పంపిన కొన్ని మెసేజ్‌లు అతడి ప్లాన్‌ను పూర్తిగా భగ్నం చేశాయి.
లాతూర్ జిల్లా ఔసా తాలూకాలో ఆదివారం తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన ఓ కారులో మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ కారు గణేశ్ చవాన్ అనే బ్యాంక్ రికవరీ ఏజెంట్‌కు చెందినదిగా గుర్తించారు. చవాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కారులో ఉన్న మృతదేహం అతడిదేనని పోలీసులు మొదట భావించారు.
Andhra Pradesh weather : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…
అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అనుమానాలు మొదలయ్యాయి. గణేశ్ చవాన్ వ్యక్తిగత జీవితం గురించి విచారణ చేయగా, అతడికి (Ganesh Chavan case) ఓ మహిళతో సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఆమెను ప్రశ్నించగా, గణేశ్ చవాన్ మరో మొబైల్ నంబర్ నుంచి తనకు మెసేజ్‌లు పంపుతున్నాడని వెల్లడించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆ నంబర్‌ను ట్రాక్ చేసిన పోలీసులు సింధుదుర్గ్ జిల్లా విజయదుర్గ్ ప్రాంతంలో గణేశ్ చవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. ఇంటి లోన్ తీర్చేందుకు కోటి రూపాయల బీమా డబ్బు పొందాలనే ఉద్దేశంతో ఈ పథకం రచించినట్టు చెప్పాడు.
శనివారం గోవింద్ యాదవ్ అనే వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి, మద్యం మత్తులో ఉన్న అతడిని కారులో డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి సజీవ దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మృతదేహం తనదేనని నమ్మించేందుకు తన బ్రాస్‌లెట్‌ను అక్కడే వదిలేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని లాతూర్ ఎస్పీ అమోల్ తాంబే వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :