పంజాబ్ రాష్ట్రంలోని శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా, సింగేవాలా గ్రామంలో గత అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు ప్రాణాల్ని బలిగొంది. ఈ ఘటనలో ఐదుగురు వలస కార్మికులు(Migrant workers) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరింత విషాదకరమైన విషయం ఏంటంటే, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ పేలుడు ధాటికి కర్మాగారం పూర్తిగా కుప్పకూలింది. ఆ వెంటనే మంటలు అంటుకున్నాయి. అయితే, భవనం కూలడం వల్లే ప్రాణనష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు.

అనుమానం
క్షతగాత్రులను బఠిండా(Bathinda)లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ముక్త్సార్‌లోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. వాటికింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కర్మాగారం హర్యానా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
Read Also: BRS: బీఆర్ఎస్ నేత ఆత్మహత్య