ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న ప్రతీ ఒక్క తల్లిదండ్రులు వారికి ఏమైనా అవుతుందంటే విపరీతంగా భయపడిపోతుంటారు. వారిని కాపాడుకోవాలని తీవ్రంగా కృషి చేస్తుంటారు. చిన్న దెబ్బ తగలబోతుందని తెలిసినా పరుగులు పెట్టి మరీ వారిని రక్షిస్తుంటారు. అచ్చంగా ఇలాగే చేయాలనుకున్నాడో తండ్రి. ముఖ్యంగా తన రెండేళ్ల కుమారుడు ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ ఉండగా.. అప్పుడే పెద్ద ఎత్తున కోతుల(Monkeys) గుంపు వచ్చింది. అయితే విషయం గుర్తించిన తండ్రి అవి తన కుమారుడిని ఏమైనా చేస్తాయేమోనని భావించి వెంటనే వెళ్లగొట్టాలనుకున్నాడు. కానీ చేతికి ఏవీ దొరకలేవు. వెతకగా వెతకగా ఓ గొడ్డలి కనిపించింది. దీంతో దాన్ని తీసి కోతులపైకి విసిరాడు. కానీ దురదృష్టవశాత్తు అది తన కుమారుడిపైనే పడింది.

ఓ పెద్ద కోతుల గుంపు
ఉత్తర ప్రదేశ్(UttaraPradesh)లోని మొరాదాబాద్‌కు చెందిన లఖన్ సింగ్‌కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే అతడి పేరు ఆరవ్ కాగా.. కన్నకొడుకును కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. తన ప్రాణాలన్నీ అతడిపైనే పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ముందు నుంచీ కుమారుడిపై అమితమైన ప్రేమ ఉండగా.. బాలుడికి ఏ చిన్న దెబ్బ తగలకుండా చూసేవాడు. అయితే ఎప్పటిలాగే ఆరవ్ తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. లోపల ఉన్న తండ్రి లఖన్ సింగ్ బాలుడిని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు.
గొడ్డలి మెడకు తాకగా.. మెడను కోసేసింది
వెంటనే వాటిని వెళ్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ సయమానికి ఇంట్లో ఎలాంటి కర్ర దొరక్కపోవడంతో.. పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకున్నాడు. ఆపై మేడ మీదకు ఎక్కి దాన్ని కోతులపైకి విసిరాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ గొడ్డలి కింద ఆడుకుంటున్న తన రెండేళ్ల కుమారుడు ఆరవ్‌పై పడింది. నేరుగా వెళ్లి అతడి మెడకు తాకగా.. మెడను కోసేసింది. దీంతో పక్కనే ఉన్న గోడలపైకి మొత్తం రక్తం చిందింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ వచ్చి బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ల
తన మేనల్లుడిని కావాలనే బావ చంపాడు: బావ మరిది
కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ప్రమాదవశాత్తు బాలుడు చనిపోగా.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. కానీ లఖన్ సింగ్ బావ మరిది రంగంలోకి దిగి.. తన మేనల్లుడిని కావాలనే బావ చంపినట్ల వివరించాడు. తన సోదరిని ఎప్పుడూ కొడుతూ, గొడవలు పడుతూ ఇబ్బంది పెట్టేవాడని, అతడే ఆరవ్‌ను చంపేశాడని ఆరోపించాడు. మరోవైపు గ్రామస్థులేమో.. కోతులే ఇనుప రాడ్లను జార విడిచాయని.. అవే బాలుడికి తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అయితే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. ప్రమాదవశాత్తే బాలుడు చనిపోయాడని గుర్తించారు.
Read Also: Rape: ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే అత్యాచార బాలిక మృతి