వాహనం ధ్వంసం ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు హుజూర్నగర్ (గరిడేపల్లి) : సూర్యాపేట Suryapet జిల్లా లోని పాలకవీడు మండలం భవానిపురం సమీపంలో ఉన్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసు కుంది. ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి చనిపోయిన సంఘటనలో ఫ్యాక్టరీ లో పనిచేసే కార్మికులు ఆందోళన చేపట్టడంతో వివాదం తలెత్తింది. విషయం తెలుసుకున్న పాలకీడు పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టడంతో గొడవ జరిగింది. కార్మికులు పోలీసులపై తిరగబడి దాడికి దిగారు. ఈ దాడులలో పాలకీడు ఎస్సై కోటేష్, ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. Deccan ఆదివారం సాయంత్రం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వినోద్ అనే కార్మికుడు తన క్వార్టర్స్ లో తన బట్టలు ఉతికే క్రమంలో కిందపడి ఉండటాన్ని గమనించిన తోటి సిబ్బంది యాజమాన్యానికి సమాచారం అందించడంతో అతన్ని మిర్యాలగూడ లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
చనిపోయిన వినోద్ మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ కు తరలించారు. ఈ క్రమంలో కార్మికుని మృతికి యాజమన్య నిరక్ష ్యమ్లే కారణమని ఆరోపిస్తూ తగిన న్యాయం చేయాలని సోమవారం ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులపై కర్రలు, రాళ్లతో కార్మికులు దాడికి దిగారు. Deccan ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కార్మికుల దాడిలో పోలీసు వాహనం కూడా ధ్వంసం అయింది. దీంతో కోదాడు రూరల్, మునగాల సిఐలు ప్రతాప్ లింగం, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గరిడేపల్లి, నేరేడుచర్ల, మఠంపల్లి ఎస్సైలు చలికింటి నరేష్ రవీందర్ నాయక్, బాబు పాటు పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.

Deccan
ఫ్యాక్టరీలు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులపై దాడికి పాల్పడిన ఆందోళనకారులను, అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. సంఘటన స్థలాన్ని సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలు పోలీసులపై దాడి చేసిన ఆందోళనకారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన పాలకీడు మండలం భవానిపురంలో ఉన్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ని పరిశీలించారు. పోలీసులపై దాడికి దిగిన ఆందోళనకారులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీస్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాడిలో ధ్వంసమైన వాహనాలు ఫ్యాక్టరీ ఇన్ఫాస్ట్రక్చర్ను ఆయన పరిశీలించారు. ఆందోళనకారులు చేసిన దాడిలో గాయపడిన సిబ్బందిని ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కొంతమంది కార్మికులు ధర్నా చేస్తున్నారని ఫ్యాక్టరీ యాజమాన్యం ద్వారా పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. ఈ విషయంపై స్పందించి పాలకీడు ఎస్ఐ SI కోటేష్ తన సిబ్బందితో ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగా అక్కడ 100 నుంచి 150 మంది కూలీలు ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన వినోద్ (48) అనే కార్మికుడు ఆదివారం సాయంత్రం సెలవు ఉండటంతో తన క్వార్టర్స్ లో బట్టలు ఉతికే సమయంలో గుండె నొప్పి వచ్చి పడిపోయినట్లు తెలిపారు. దీనిని గమనించి అందుబాటులో ఉన్న సిబ్బంది అతన్ని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడ నుంచి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అతను చనిపోయినట్లు వైద్య అధికారులు నిర్ధారించినట్లు తెలిపారు. వినోద్ మృతి పై ఎలాంటి అనుమానం లేదని సహచర కార్మికులు అతని స్నేహితులు యాజమాన్యానికి తెలపగా అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఉత్తర ప్రదేశ్ కి పంపించినట్లు వివరించారు. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు వినోద్ మృతిని అడ్డం పెట్టుకొని యాజమాన్యాన్ని డబ్బులు అడగాలన్న ఉద్దేశంతో ఆందోళనకు దిగినట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: