పట్టణ ప్రాంతాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోగలుతుంది. దీనితో తమ పిల్లలను చూసుకోడానికి ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారికి అప్పగించి వెళ్తుంటారు. అయితే అలా చేయడానికి అవకాశం లేనివారు ఆయాలను నియమించుకోవడం చేస్తుంటారు. ఇవేవీ సాధ్యం కానీ ఉద్యోగాలకు వెళ్లే దంపతులు ఇష్టం లేకపోయినా మరో మార్గంలేక తమ పిల్లలను డే కేర్(Day Care) సెంటర్‌లలో వదిలి వెళ్తుంటారు. దాని కోసం వారికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తుంటారు. వారు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు వారికి కావలసిన భోజనం తదితర అవసరాలను తీర్చాల్సి ఉంటుంది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్
చిన్నారులను ప్రేమగా చూసుకోవాల్సిన డే కేర్ సిబ్బంది ఓ పసిపాప పట్ల దారుణంగా వ్యవహరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Social Media Vedio)గా మారింది. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్(Uttara Pradesh)లోని నోయిడా(Noida)కు చెందిన దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులు. దీంతో తమ 15 నెలల పాపను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో రోజూ స్థానికంగా ఉన్న ఓ డే కేర్ సెంటర్‌లో వదిలి ఉద్యోగాలకు వెళ్లేవారు. సాయంత్రం ఇంటికి తీసుకు వచ్చేవారు. ఇటీవల ఆ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చాక దుస్తులు మారుస్తున్న క్రమంలో చిన్నారి శరీరంపై పలు చోట్ల గాయాలు, కొరికిన గుర్తులు ఉన్నట్లు గమనించారు.
కిందపడేసి, గోడకేసి, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొడుతున్న దృశ్యాలు
అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డే కేర్ సెంటర్‌కు వెళ్లి వారిని నిలదీశారు. సిబ్బంది అక్కడి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అందులో అక్కడ ఆయాగా పని చేసే యువతి చిన్నారి ఎక్కువగా ఏడుస్తుండంతో అసహనానికి గురై ఏడుస్తున్నా పట్టించుకోకుండా.. కిందపడేసి, గోడకేసి, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో తల్లిదండ్రులు వారిని నిలదీశారు, అయితే ఈ విషయం తెలిసినప్పటికీ యాజమాన్యం తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్న కూడా చేయలేదు. పైగా ప్రశ్నించినందుకు వారిపై దుర్భాషలాడారని ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వీడియోలో రికార్డైన దృశ్యాలను పోలీసుల ముందుంచారు. ఆ వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు డే కేర్ సెంటర్‌లో పని చేసే యువతిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సెక్షన్-142 పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితురాలైన పనిమనిషిని అరెస్టు చేశారు. “ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితురాలైన పనిమనిషిని అదుపులోకి తీసుకున్నామని.. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి” అని ఒక పోలీసు అధికారి ధృవీకరించారు..
డేకేర్ సెంటర్ అంటే ఏమిటి?
డే-కేర్ సెంటర్ | చైల్డ్ కేర్, విద్య, అభివృద్ధి | బ్రిటానికా
డే-కేర్ సెంటర్, పగటిపూట శిశువులు మరియు చిన్నపిల్లల పర్యవేక్షణ మరియు సంరక్షణను అందించే సంస్థ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు ఉద్యోగాలు పొందగలిగేలా. ఇటువంటి సంస్థలు 1840లో ఫ్రాన్స్‌లో కనిపించాయి మరియు సొసైటీ డెస్ క్రెచెస్‌ను 1869లో ఫ్రెంచ్ ప్రభుత్వం గుర్తించింది.
డే కేర్ సెంటర్ యొక్క విధి ఏమిటి?
పిల్లల కోసం డే కేర్ సెంటర్లు పిల్లల సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి పిల్లలకు సురక్షితమైన మరియు ప్రేమగల వాతావరణాన్ని అందిస్తాయి, ఇక్కడ వారు ప్రొఫెషనల్ సంరక్షకులతో చుట్టుముట్టబడి ఉంటారు. ఇది పిల్లలను స్వతంత్రంగా చేస్తుంది మరియు వారిలో సామాజిక నైపుణ్యాలు మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: