హైదరాబాద్ : ఇటీవల అక్రమ లోన్ యాప్ల ద్వారా జరుగుతున్న మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ యాప్ లు తక్కువ డాక్యుమెంట్లు.. కేవలం ఆధార్ కార్డుతోనే లోన్ అప్రూవల్..5 నిమిషాల్లో రుణం వంటి ఆకర్షణీయమైన వాగ్దానాల తో ప్రజలను మోసం చేస్తున్నాయి. రుణం ఇచ్చిన తర్వాత అధిక వడ్డీలు, దాచిన ఛార్జీలు విధించడం మాత్రమే కాకుండా, బాధితుల మొబైల్లోని కాంటాక్ట్స్, ఫోటోలు సేకరించి బెదిరింపులు, అవమానకర సందేశాలు పంపుతూ డబ్బు వసూలు చేస్తున్నారు. ప్రజలకు తెలియని లేదా నిర్ధారణ లేని లోన్ యాప్లను(Loan App Frauds) డౌన్లోడ్ చేయకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకో కుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్(Cyber Crime) పోలీసులు నగర ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Read Also: Elections : తెలంగాణ లో MPTC, ZPTC ఎన్నికలపై నేడు క్లారిటీ!

లోన్ యాప్ మోసాలు ఇలా..
సోషల్ మీడియా, ఎస్ఎంఎస్లు లేదా ఆన్లైన్ ప్రకటనల ద్వారా ‘మినిమం డాక్మెంట్ వెరిఫికేషన్, అతిత్వరలో లోన్ మంజూరు” అంటూ ప్రజలను ఆకర్షిస్తారు.
మొదట చిన్న మొత్తాన్ని అకౌంట్లో జమ చేస్తారు. కానీ రుణ కాలం చాలా తక్కువగా (సాధారణంగా 7 రోజులు) ఉండి, అధిక వడ్డీ మరియు ప్రాసె సింగ్ ఫీజులు విధిస్తారు.
- అనధికారిక లోన్ యాప్లను ఇన్స్టాల్ చేయ మని చెబుతారు. యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే కాంటాక్ట్స్, గ్యాలరీ, మెసేజ్లు వంటి వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందుతుంది.
- చెల్లించాల్సిన మొత్తం అనూహ్యంగా పెరుగు తుంది. కొన్నిసార్లు బాధితుడు అడగకపోయినా మరోసారి డబ్బు జమ చేసి, మరింత రుణం పేరుతో వసూలు చేస్తారు.
- చెల్లింపులో ఆలస్యం అయితే బాధితుడి కాంటాక్ట్స్ కు కాల్స్ / మెసేజ్లు చేస్తారు మార్ఫింగ్ ఫోటోలు పంపించి అవమానపరుస్తారు లీగల్ యాక్షన్ తీసుకుంటామని బెదిరిస్తారు
- వివిధ నంబర్ల నుండి కాల్స్ చేస్తూ మానసిక ఒత్తిడి కలిగిస్తారు, తద్వారా బాధితుడు భయంతో డబ్బు చెల్లించేలా చేస్తారు.
కేవలం ఆధార్ లోన్” వంటి ఆఫర్లపై అప్రమత్తంగా ఉండండి. చాలా తక్కువ డాక్యుమెం ట్లతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పేవి అనుమా నాస్పదం - అధికారికంగా నిర్ధారించని లింకులు జాగ్రత్త గా చూడండి: బ్యాంక్ అప్డేట్లు, క్యాష్బ్యా క్లలు, వెరిఫికేషన్, లేదా ప్రభుత్వ ప్రయోజనా ల పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయవద్దు.
-యాప్ అనుమతులను పరిశీలించండి. కాంటా క్ట్స్, గ్యాలరీ వంటి అవసరం లేని అనుమతులు కోరితే వెంటనే అప్రమత్తంగా ఉండండి. - వ్యక్తిగత డేటా పంచుకోవద్దు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు సున్నితమైన సమాచారా న్ని తెలియని యాప్లలో నమోదు చేయవద్దు.
వేధింపులకు భయపడవద్దు. మోసగాళ్ల బెదిరింపులకు లోనవ్వకుండా చట్టపరమైన సహాయం పొందండి.
ఆధారాలను భద్రపరచండి. ఫిర్యాదు చేసే ముందు చాట్లు, లావాదేవీలు, స్క్రీన్షాట్లు వంటి ఆధారాలను సేవ్ చేసుకోండి.
అనుమానాస్పద యాప్లను నివేదించం డి. జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండండి. సైబర్ మోసాలను 1930 నంబరుకు కాల్ చేసి సమాచారం అందించాలని సైబర్ క్రైమ్ పోలీ సులు కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: