हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Nagar Kurnool: భార్య ప్రశ్నించిందని హతమార్చిన భర్త

Anusha
Nagar Kurnool: భార్య ప్రశ్నించిందని హతమార్చిన భర్త

నాగర్‌కర్నూల్ జిల్లాలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.భార్యను అతి కిరాతకంగా హతమార్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఓ భర్త. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, భార్య నిలదీయడంతో విచక్షణ కోల్పోయి కిరాతకానికి పాల్పడ్డాడు. 30 ఏళ్ల దాంపత్య బంధానికి తెర దించాడు భర్త నాగశేషి. 

పూర్తీవివరాలు

స్థానికంగా నివసించే నాగశేషి, 1995లో ఎలుక నాగశేషికి ఎల్లమ్మ (40)తో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక కూతురు ఉన్నారు. ఆలుమగలు ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తున్నారు. 30 ఏళ్లుగా పచ్చగా సాగుతున్న వీరి సంసారంలో భర్త వివాహేతర సంబంధం, మద్యం అలవాటు చిచ్చురేపింది.అప్పుడప్పుడు వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్న కొద్దిసేపటికే సర్దుమణిగేది. అయితే మే 29వ తేదీన నాగశేషి బావమరిది ముంత శ్రీనివాస్(Muntha Srinivas) దంపతులకు వడి బియ్యం పెట్టి రాత్రి వారిని ఇంటికి పంపించారు. అదే వేడుక సందర్భంగా రాత్రి నాగశేషి ఎక్కువగా మద్యం సేవించాడు. రాత్రి సుమారు 10.30 నిమిషాల సమయంలో నాగశేషి, భార్య ఎల్లమ్మకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త వివాహేతర సంబంధాన్ని భార్య ఎల్లమ్మ నిలదీయడంతో గొడవ కాస్త పెద్దదైంది. దీంతో ఆగ్రహించి ఎల్లమ్మను నాగశేషి విచక్షణ రహితంగా కర్రతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రి బిచ్చన్నను పక్కకు తోసేశాడు.

Nagar Kurnool: భార్య ప్రశ్నించిందని హతమార్చిన భర్త
Nagar Kurnool: భార్య ప్రశ్నించిందని హతమార్చిన భర్త

ప్రాథమిక

నాగశేషి తండ్రి బిచ్చన్న తీవ్ర ఆందోళనతో కేకలు వేయడంతో చుట్టూ పక్కల వారు గమనించి తీవ్ర గాయాలైన ఎల్లమ్మను వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అర్దరాత్రి చికిత్స పొందుతూ ఎల్లమ్మ మృతి చెందింది. ఘటన అనంతరం తన భార్యను తానే చంపానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు భర్త నాగశేషి(Nagaseshi). ఎల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకుని వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మద్యం మత్తులోనే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక మూడు దశాబ్దాల దాంపత్య జీవితాన్ని వివాహేతర సంబంధం అనుమానాలు, మద్యం మత్తు చిత్తు చేసింది. అనుకోని ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: Thane: హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత ఇంజనీర్..పాక్ కు రహస్యాల చేరివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870