Chittoor crime: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పరపల్లిలోని ఎస్వీ డిఫెన్స్ అకాడమీ (బీఎస్ఆర్ కళాశాల)లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెదురుకుప్పం మండలం పాతగుంటకు చెందిన తులసిరెడ్డి (17) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం మంగళవారం మధ్యాహ్నమే అతను హాస్టల్‌కు చేరుకున్నాడు. సాయంత్రం తోటి విద్యార్థులు తరగతులకు వెళ్లగా, తాను నీరసంగా ఉన్నానని, వైస్ ప్రిన్సిపల్ అనుమతి తీసుకున్నానని చెప్పి గదిలోనే ఉండిపోయాడు.
Read Also: Cyber crime: నకిలీ AI వీడియోలతో అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లు

సోషల్ మీడియా స్టేటస్‌లో ఆఖరి సందేశం
రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థులు తిరిగి వచ్చేసరికి తులసిరెడ్డి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపులు పగులగొట్టి అతడిని రుయా ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువుపై ఆసక్తి లేకనే తన కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని మృతుడి తండ్రి మునిరత్నంరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, మరణానికి ముందు తులసిరెడ్డి తన ఫోన్ స్టేటస్‌లో “లాస్ట్ డే.. ఐ లవ్ యూ దెయ్యం.. నేను వచ్చేస్తున్నా” అని పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
మరోవైపు, విద్యార్థి మృతిపై యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు బుధవారం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: