Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో హోలీ సంబరాల వేళ ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. వేడుకలకు వెళ్లిన ఒక ఇంటర్మీడియట్ విద్యార్థినిని ముగ్గురు కామాంధులు కారులో కిడ్నాప్ చేశారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.
Read also: Siddipet crime: ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య

Uttar Pradesh Crime
నిందితుల అరెస్ట్
బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ మరియు దీపాంషు యాదవ్‌లను పోలీసులు (Police) అరెస్టు చేశారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్
ఈ దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన ఆవేదనతో కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: