हिन्दी | Epaper

Bihar Crime: 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం! ఐదుగురు అరెస్ట్

Pooja
Bihar Crime: 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం! ఐదుగురు అరెస్ట్

Bihar Crime: బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో అత్యంత దారుణమైన అమానుష ఘటన వెలుగుచూసింది. మార్చి 5వ తేదీన 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఒకరు పథకం ప్రకారం యువతిని నమ్మించి ఒక చోటికి పిలిపించాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Read Also:Mandamarri crime: పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

Bihar Crime
Bihar Crime: Gang rape of 19-year-old girl! Five arrested

ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన భోజ్‌పూర్ పోలీసులు

ఈ ఘోర కలికలంపై సమాచారం అందుకున్న బాధితురాలి సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యుద్ధప్రాతిపదికన విచారణ చేపట్టి, ఇప్పటివరకు ఈ దారుణంతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ కేసుపై భోజ్‌పూర్ ఎస్పీ రాజ్ స్పందిస్తూ.. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని వెల్లడించారు. నిందితులందరినీ కఠినంగా శిక్షించేలా పక్కా ఆధారాలు సేకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్న ఈ ఘటనపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులకు త్వరితగతిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870