ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) నారాయణ్‌పూర్ మావోయిస్టు ఎన్ కౌంటర్(Encouter) పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం. ఈరోజు, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో, మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి, వారిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రధాన పురోగతికి మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను నేను అభినందిస్తున్నాను.

54 మంది నక్సలైట్లను అరెస్టు
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత, 54 మంది నక్సలైట్లను అరెస్టు అయ్యారు. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని పంచుకోవడానికి కూడా సంతోషంగా ఉందన్నారు. మార్చి 31, 2026 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
భారీ ఎన్‌కౌంటర్‌లో 28 మావోయిస్టులు మృతి
కాగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 28 మావోయిస్టులు మృతి చెందారు. అయితే చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(67) కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మాధ్ ప్రాంతంలో బసవరాజు ఉన్నారన్న సమాచారంతోనే భద్రతా బలగాలు చుట్టిముట్టగా దాన్ని గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రాతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో సుమారు 28 మంది మావోయిస్టులు హతం అయ్యారు.
Read Also: Israel: గాజాలో ఇజ్రాయెల్ దాడి.. 85 మంది పాలస్తీనియన్లు మృతి