हिन्दी | Epaper

Bhopal: ఫర్నీచర్ , ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం 

Aanusha
Bhopal: ఫర్నీచర్ , ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం 

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ (Bhopal) లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. నగర పరిధిలో ఉన్న ఓ ఫర్నీచర్ తయారీ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ఎక్కువ మొత్తం ప్టాస్టిక్ సామాగ్రి ఉండడంతో కొన్ని క్షణాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. గమనించిన కార్మికులు భయంతో వెంటనే ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీశారు.

Read Also: Ahmedabad Flight Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ రిపోర్ట్ ను నమ్మొద్దు – కేంద్రం స్పష్టం

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో ఎగిపడుతున్న మంటలు.. భయాందోళనలో కార్మికులు
Bhopal: Massive fire breaks out in furniture and plastic factory

భారీగా ఆస్తినష్టం

ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలుతో పాటు పొగ ఎగిసిపడుతుండడంతో స్థానిక ప్రాంతాలు మొత్తం పొగ మయంగా మారిపోయి.సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గంటల తరబడి మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్, చెక్క వస్తువులు కావడంతో మంటలను ఆర్పడం కష్టతరంగా మారింది. ఈ ప్రమాద ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా? ప్రాణనష్టం జరిగిందా? అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870