ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పెళ్లి తర్వాత సంబంధాల్లో చొరబడిన మూడో వ్యక్తి వల్ల హాయిగా సాగాల్సిన గృహజీవితం అగ్నిగుండంగా మారుతోంది. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఒక విషాదకర ఘటన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే, బెంగుళూరులోని బాణశంకరి పరిధిలో హేమ్మిగేపుర ప్రాంతానికి(Hemmigepura area) చెందిన హరిణి (33), దేసేగౌడ (41) భార్యాభర్తలు. 2012లో పెళ్లైన ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం,బాధ్యతలు, పిల్లలు ఇవన్నీ హరిణి జీవితంలో భాగమయ్యాయి. సాఫీగా సాగుతున్న జీవితంలోకి మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి ప్రవేశించాడు.
వివాహేతర సంబంధానికి
మూడు సంవత్సరాల క్రితం ఒక జాతరలో కామన్ ఫ్రెండ్ ద్వారా హరిణికి యశాస్ (25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచుగా యశాస్‌ను కలుస్తూ, తన సంసార జీవితాన్ని పక్కన పెడుతూ వచ్చింది హరిణి(Harini). అయితే ఈ విషయం హరిణి భర్త, కుటుంబ సభ్యులకు తెలియగా వారు షాక్‌కు గురయ్యారు. కౌన్సిలింగ్ ఇచ్చి బంధాలు, విలువలు, కుటుంబ గౌరవం గురించి వివరించారు. హరిణి కూడా తన తప్పును తెలుసుకుని గత రెండు నెలలుగా యశాస్‌ను కలవడం మానేసింది. అందరిలాగే తన జీవితాన్ని సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంది.

హరిణిని ఒప్పించాడు
ఈ క్రమంలో చివరిసారిగా కలుద్దామని హరిణిని యహాస్(Yahas) అడిగాడు. అందుకు నిరాకరించిన హరిణి తన భర్తకు విషయం తెలిసిపోయిందని, మరోసారి కలవలేనని చెప్పింది. యశాస్ చాలా సేపు ప్రయత్నించి హరిణిని ఒప్పించాడు. దీంతో ఈ నెల 6వ తేదీన పూర్ణ ప్రజ్న లేఅవుట్‌లోని ఓయో హోటల్‌లో యుశాస్, హరిణి కలుసుకున్నారు. హరిణి తనతో బంధం తెంచుకుంటుందని కోపోద్రిక్తుడైన యశాస్ ముందుగానే తెచ్చుకున్న కత్తితో ఆమెను 17 సార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
Read Also: RCB: ఆర్సీబీ ఘటనలో గవర్నర్,సీఎంల మధ్య ముదురుతున్న వివాదం