हिन्दी | Epaper

AP News: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

Tejaswini Y
AP News: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

AP News: ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) సభ్యులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. తాము సమర్పించిన రాజీనామాలపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా హాజరుకావాలని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు శుక్రవారం నోటీసులు జారీ చేశారు.

Read Also: Telangana: విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ఇంజినీర్ల సస్పెన్షన్

AP News: Notices to YCP MLCs who resigned
AP News: Notices to YCP MLCs who resigned

ముఖ్య నేతలకు నోటీసులు

రాజీనామా లేఖలు సమర్పించిన ఐదుగురు ఎమ్మెల్సీలను వేర్వేరు తేదీల్లో విచారణకు పిలిచారు:

  • ఫిబ్రవరి 26న: ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మరియు మర్రి రాజశేఖర్ రెడ్డి మండలి ఛైర్మన్ ముందు హాజరుకావాల్సి ఉంటుంది.
  • ఫిబ్రవరి 25న: మరో ఎమ్మెల్సీ జయమంగళం వెంకట రమణను విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించారు.

రాజీనామాలు స్వచ్ఛందంగానే చేశారా లేదా అనే అంశంపై వీరి నుంచి ఛైర్మన్ స్పష్టత తీసుకోనున్నారు. ఈ విచారణ అనంతరం వారి రాజీనామాలను ఆమోదించే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870