సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సీఎంకి లేఖ రాశారు. 2024-25లో ఏపీకి కేంద్రం నుంచి విడుదలైన నిధుల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా.. అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం, కేంద్ర పథకాల నిధుల్లోనూ గత ఏడాది కన్నా ఈ ఏడాది నిధుల రాక తగ్గిందన్నారు. వాస్తవాలు మభ్యపెట్టి ఏపీకి రూ.3 లక్షల కోట్లు అందించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం దుర్మార్గమని రామకృష్ణ విమర్శించారు.

Advertisements
సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

కాగా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.17 వేల కోట్ల అప్పులున్నాయని కేంద్రం చెబుతోందని.. అలాంటప్పుడు కేవలం రూ.11,500 కోట్లు కేటాయించడం వల్ల సమస్య పరిష్కారం కాదని రామకృష్ణ అన్నారు. ఆ ప్లాంట్‌ను కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. విశాఖ ఉక్కుకు ముడి ఇనుము గనులు కేటాయించి, సెయిల్‌లో విలీనం చేయాలని అన్నారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించకుండా అనకాపల్లిలో దాదాపు రూ.70 వేల కోట్లతో మిట్టల్‌ ఏర్పాటు చేయనున్న ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయిస్తే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Related Posts
సైఫ్ హాస్పటల్ బిల్‌ ఎంతో తెలుసా..?
saif ali khan Hospital bill

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి ఆయన ఇటీవల Read more

LRS : LRS రాయితీ గడువు పెంచే అవకాశం?
Telangana government key update on LRS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) లో 25% రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ప్రభుత్వం ఇచ్చిన Read more

‘దొండ’తో ఆరోగ్యం మెండు!
Ivy Gourd Health Benefits

దొండకాయను ప్రతిరోజూ ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పుష్కల పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలో ఉండే విటమిన్లు, ఖనిజాలు Read more

ప్రపంచ స్వాతంత్య్ర దినోత్సవం!
ప్రపంచ స్వాతంత్య్ర దినోత్సవం!

ప్రపంచ స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 9న జరుపుకుంటారు. ఈ రోజు 1989లో జరిగిన చారిత్రక సంఘటనను గుర్తించేందుకు మరియు ప్రపంచంలో స్వాతంత్య్రం, సమాన హక్కులు, Read more

Advertisements
×