Ivy Gourd Health Benefits

‘దొండ’తో ఆరోగ్యం మెండు!

దొండకాయను ప్రతిరోజూ ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పుష్కల పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రత్యేకించి, ఆరోగ్య సమస్యల నివారణలో దొండకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి దొండకాయ చాలా లాభదాయకంగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు సమతుల్యంగా ఉంటాయి. మూత్రాశయ వ్యాధులు, కిడ్నీల్లో రాళ్ల సమస్యల నివారణకు దొండకాయను ఆహారంలో చేర్చడం ఉత్తమమైన మార్గం అని వైద్యులు సూచిస్తున్నారు.

చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా దొండకాయ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో ఉండే నీరు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమను అందించి కాంతివంతంగా ఉంచుతాయి. దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గించడంలో దొండకాయ సహజ ఔషధంగా పనిచేస్తుంది. అలాగే దొండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. క్రమం తప్పకుండా దొండకాయ తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. ఓవరాల్ గా దొండకాయ ఆరోగ్యానికి ప్రకృతి అందించిన అమూల్యమైన కూరగాయ. రోజూ తక్కువ మోతాదులో దొండకాయ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

Related Posts
ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి..
PCC chief appeals to movie stars to end this controversy

PCC chief appeals to movie stars to end this controversy. హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల గురించి చేసిన Read more

నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ
నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ

నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్‌కు రెండు రోజుల అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో, ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో Read more

సల్మాన్ బతికుండాలంటే రూ. 5 కోట్లు ఇవ్వండి – పోలీసులకు మెసేజ్
salman 5cr

సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు Read more

టెస్లా కారు కొనుగోలు చేసిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump buys Tesla car

వాషింగ్టన్‌: టెస్లా మోడల్ ఎస్ కారును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేశారు. దీంతో టెస్లాకు మద్దతుగా నిలిచారు. ట్రంప్‌ కారు కొనుగోలు చేసేందుకు వీలుగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *