CPI Ramakrishna letter to CM Chandrababu

సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సీఎంకి లేఖ రాశారు. 2024-25లో ఏపీకి కేంద్రం నుంచి విడుదలైన నిధుల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా.. అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం, కేంద్ర పథకాల నిధుల్లోనూ గత ఏడాది కన్నా ఈ ఏడాది నిధుల రాక తగ్గిందన్నారు. వాస్తవాలు మభ్యపెట్టి ఏపీకి రూ.3 లక్షల కోట్లు అందించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం దుర్మార్గమని రామకృష్ణ విమర్శించారు.

image

కాగా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.17 వేల కోట్ల అప్పులున్నాయని కేంద్రం చెబుతోందని.. అలాంటప్పుడు కేవలం రూ.11,500 కోట్లు కేటాయించడం వల్ల సమస్య పరిష్కారం కాదని రామకృష్ణ అన్నారు. ఆ ప్లాంట్‌ను కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. విశాఖ ఉక్కుకు ముడి ఇనుము గనులు కేటాయించి, సెయిల్‌లో విలీనం చేయాలని అన్నారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించకుండా అనకాపల్లిలో దాదాపు రూ.70 వేల కోట్లతో మిట్టల్‌ ఏర్పాటు చేయనున్న ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయిస్తే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Related Posts
ఏపీలో నేటి నుంచి నూతన మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ
liquor sales in telangana jpg

Wines bandh రాష్ట్రంలో మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్ తీసుకవచ్చింది. దసరా పండుగకు ముందే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ Read more

పరువు నష్టం కేసులో బాన్సురీ స్వరాజ్‌కు ఊరట
Relief for Bansuri Swaraj in defamation case

పరువు నష్టం కేసును కొట్టేసిన ఢిల్లీ కోర్టు న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కి క్రిమినల్‌ పరువు నష్టం కేసులో ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ Read more

ట్రంప్ విధానాలతో లక్ష ఉద్యోగాలకు ఎసరు!
25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య యుద్ధం పెరిగే ప్రమాదం నెలకొంది. అమెరికాలోకి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై ట్రంప్ 25% Read more

ఏపీలో 15 ప్రాజెక్టులకు ఆమోదం

అమరావతి, జనవరి 30 : రాష్ట్రంలో పెట్టుబడులపై కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి Read more