Babu who did PhD in cheating..Jagan

చీటింగ్ లో పీహెచ్ డీ చేసిన బాబు: జగన్‌

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో ఒక్క సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని చెప్పినట్లు జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని చెప్పినట్లు గుర్తుచేశారు.

ఈ తొమ్మిది నెలల కాలానికి బడ్జెటరీ అకౌంట్ అప్పులే రూ.80 వేల కోట్లని జగన్ వివరించారు. అమరావతి పేరుతో రూ.52 వేల కోట్లు, మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయి ద్వారా రూ.8 వేల కోట్లు, ఏపీఎండీసీ ద్వారా రూ. 5 వేల కోట్లు.. మొత్తంగా రూ. 1.45 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. మరి ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎన్ని బటన్ లు నొక్కిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని జగన్ నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలలోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కారు అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు.

image

ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్లను ఎలా మోసం చేసిందో చూశామని, కొత్తగా ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల మంది వలంటీర్లతోపాటు బెవరేజెస్ లోని 18 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. తమ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం, రైతు భరోసా, వసతి దీవెన తదితర పథకాలకు కూటమి సర్కారు మంగళం పాడిందని జగన్ ఆరోపించారు. ఆ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు.

Related Posts
పార్టీని వీడే ప్రసక్తి లేదని ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్సీ
Pandula Ravindra Babu

అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి వైసీపీ కీలక నేతలు పార్టీని వీడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాల పర్వం ఎక్కువైంది. మాజీ Read more

జగన్ రాజకీయాలను నేరపూరితంగా మార్చారు – సీఎం చంద్రబాబు
భయపడను చంద్రబాబుకి జగన్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ ముసుగులో Read more

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు బెదిరింపులు
Threats to Maharashtra CM Fadnavis

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు బెదిరింపులు రావడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. శుక్రవారం ఉదయం పాకిస్థాన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు Read more

Posani Krishna Murali: పోసాని సీఐడీ కస్టడీ
Posani Krishna Murali: పోసాని సీఐడీ కస్టడీ

పోసాని కృష్ణమురళి సీఐడీ కస్టడీకి – కోర్టు అనుమతి సినీ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పోసాని కృష్ణమురళిని తమ కస్టడీకి అనుమతించాలన్న సీఐడీ Read more