Rumors: డేటింగ్ రూమర్స్‌పై తొలిసారి స్పందించిన గిల్

Rumors: డేటింగ్ రూమర్స్‌పై తొలిసారి స్పందించిన గిల్

గత కొన్ని నెలలుగా టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది.అతడు ఎవరితో కలిసి తిరుగుతున్నాడు, ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు వంటి విషయాలపై ఆరా తీయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో అతడి డేటింగ్ లైఫ్ పై రూమర్స్ తరచుగా రావడం ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా తన డేటింగ్ లైఫ్ పై క్లారిటీ ఇచ్చాడు గిల్. తాను ఎవరితో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడో స్పష్టత ఇచ్చాడు.శుభ్‌మన్ గిల్‌.. బాలీవుడ్ భామలతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ఆ మధ్యలో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. మొదటగా.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. కానీ ఆ తర్వాతే పలువురు ముద్దుగుమ్మల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సారా అలీఖాన్, రిద్ధిమా పండిట్‌, అవనీత్ కౌర్ ఇలా పేర్లు వినిపించాయి. గిల్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెగ ప్రచారం సాగింది. అంతటా అతడి పెళ్లి గురించే చర్చ ఎక్కువైంది.

Advertisements

ప్రొఫెషనల్ కెరీర్‌

ఈ క్రమంలోనే గిల్ తాజాగా తన డేటింగ్ రూమర్స్ పై స్పందించాడు. “నేను గత 3 ఏళ్లుకు పైగా సింగిల్‌గానే ఉన్నాను. ఈ మధ్య చాలా మందితో నాకు లింక్ చేస్తూ ఊహాగానాలు, పుకార్లు వస్తున్నాయి. కొన్నిసార్లు అవి మరింత దారుణంగా ఉన్నాయి. నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తితో కూడా లింకులు పెడుతున్నారు. ప్రస్తుతం నేను నా ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెట్టాను.” అని గిల్ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఏప్రిల్ 21న తన పెళ్లి గురించి కూడా స్పందించాడు. ఇప్పట్లో చేసుకునేది లేదని తేల్చిచెప్పాడు.అలానే కోహ్లీ, రోహిత్ తో కలిసి ఆడటంపై కూడా మాట్లాడాడు గిల్. “రోహిత్ భాయ్, విరాట్ భాయ్ వంటి ఆటగాళ్లను చూస్తూ పెరిగాను. ఇప్పుడు వారితో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఆ అనుభూతిని వర్ణించడం కష్టమే.” అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం తన జీవితంలో ప్రేమకు లేదా రిలేషన్‌షిప్‌కు సమయం లేదని గిల్ స్పష్టం చేశాడు. “నా ప్రొఫెషనల్ కెరీర్‌లో నేను ఏం చేయాలో దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. సంవత్సరంలో దాదాపు 300 రోజులు మేము ప్రయాణిస్తూనే ఉంటాం. కాబట్టి, ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉండటానికి, సమయం కేటాయించడానికి నా జీవితంలో ప్రస్తుతం అంత స్పేస్ లేదు” అని గిల్ వివరించాడు.

మానసిక స్థితి

ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాళ్ళలో శుభ్‌మన్ గిల్ ఒకరు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న గిల్, తన ప్రశాంతమైన కెప్టెన్సీ శైలితో ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే, మైదానం బయట కూడా గిల్ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు.మ్యాచ్ ఆడే సమయంలో తన మానసిక స్థితి గురించి కూడా గిల్ మాట్లాడాడు. “ఇది చాలాసార్లు చెప్పాను, అది ఒక ఆటోమేటిక్ స్విచ్ లాంటిది. మ్యాచ్ ఆడేటప్పుడు, ఆ జోన్‌లో ఉన్నప్పుడు, ప్రేక్షకుల అరుపులు గానీ, బయట ఏం జరుగుతుందో గానీ నాకు వినిపించదు. ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు, ఎన్ని పరుగులు చేయాలి, నేను ఏం చేయాలి అనే దానిపైనే నా పూర్తి ఏకాగ్రత ఉంటుంది” అని గిల్ తెలిపాడు. తన ముందున్న లక్ష్యంపైనే పూర్తి దృష్టి ఉంటుందని, బయటి ప్రపంచంతో సంబంధం ఉండదని పేర్కొన్నాడు. 

Read Also: IPL 2025: ఈ ఏడాది ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకునే జట్టు ఇదే: యువరాజ్ సింగ్

Related Posts
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
RBI Governor Shaktikanta Das is ill.admitted to hospital

చెన్నై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అస్వస్థతకు గురయ్యారు. ఎసిడిటీ కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ Read more

మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం
woman constable

యూపీ లోని కాన్పూర్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం జరిగింది. అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న 34 సంవత్సరాల మహిళా కానిస్టేబుల్ కర్వా చౌత్ జరుపుకునేందుకు కాన్పూర్ బయలుదేరారు. Read more

NARENDRA MODI :మోదీతో న్యూజిలాండ్ ప్రధాని భేటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై కామెంట్స్
NARENDRA MODI :మోదీతో న్యూజిలాండ్ ప్రధాని భేటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై కామెంట్స్

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్సన్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌పై Read more

Central Government: దేశ భద్రత పై కేంద్రం కీలక నిర్ణయం!
Central Government: దేశ భద్రత పై కేంద్రం కీలక నిర్ణయం!

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా యుద్ధం రావచ్చనే Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×